దేశవ్యాప్తంగా కాంతార సినిమా పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది.కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని పలు భాషలలో విడుదల చేశారు.ప్రతి ఒక్క భాషలోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటుంది.
ఈ విధంగా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని డిజిటల్ మీడియాలో చూడటం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నవంబర్ 4వ తేదీ ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంపై నిర్మాతలు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ గౌడ ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి మాట్లాడుతూ.కాంతార సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదు.
ఈ సినిమా ఇప్పుడప్పుడే డిజిటల్ మీడియాలో ప్రసారం కాదని, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తే ఆ విషయాన్ని తామే స్వయంగా ప్రకటిస్తాము అంటూ ఈ సందర్భంగా నిర్మాతలు కాంతార సినిమా ఓటీటీ విడుదల గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.