విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా 2017లో విడుదలై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
నిర్మాత స్వప్నదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ రెడ్డి సినిమా కథ నాకు ఎంతగానో నచ్చిందని ఆ సినిమాను నిర్మించాలని భావించానని అయితే ఈ సినిమాను నిర్మించలేకపోవడానికి ధైర్యం చాలకపోవడమే కారణమని స్వప్న అన్నారు.
సమాజంను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆ సినిమాను నేను నిర్మించలేకపోయానని ఆమె కామెంట్లు చేశారు.ఒకవేళ నేను ఆ సినిమాను నిర్మించి ఛీఛీ ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా అనే కామెంట్లు వచ్చేవని స్వప్న తెలిపారు.

ఈ రీజన్ వల్లే రిస్క్ చేయలేక అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించే అవకాశాన్ని నేను వదులుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.కానీ ఆ సినిమాను నిర్మించకుండా తప్పు చేశానని ఇప్పుడు బాధ పడుతున్నానని స్వప్న పేర్కొన్నారు. పెళ్లిచూపులు మూవీ కథ కూడా నేను విన్నానని ఆ సినిమా ఫార్మాట్ విభిన్నంగా ఉండటంతో ఆ సినిమాను నిర్మించలేకపోయానని స్వప్న వెల్లడించారు.

అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ తో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయిందనే సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.విజయ్ దేవరకొండను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
స్వప్నా రెడ్డి ప్రస్తుతం భిన్నమైన కథలను ఎంచుకుంటూ నిర్మాతగా సక్సెస్ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఈ బ్యానర్ లో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి.







