ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను మొదటినుంచి ముక్కుసూటితనంతోనే వ్యవహరించానని తెలిపారు.అన్యాయం జరిగిందంటే నేను ఊరుకునేవాడిని కాదని నట్టి కుమార్ అన్నారు.
నేను అప్పట్లో కూడా మొండిగా ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.ఆ మొండితనం కొన్నిసార్లు మైనస్ అయిందని ఆయన పేర్కొన్నారు.
నా నిజాయితీ నాకు చాలా ప్లస్ అయిందని నట్టి కుమార్ వెల్లడించారు.
ఒకప్పుడు ఫైనాన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డానని నట్టి కుమార్ వెల్లడించారు.
రజనీకాంత్ సినిమా లింగా సినిమా హక్కులను ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేశానని ఆ సినిమాకు నష్టాలు వచ్చాయని అన్నారు.ఆ సినిమా వల్ల 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం నష్టపోయానని నట్టి కుమార్ వెల్లడించారు.
కొన్ని సినిమాలు లాభాలను అందిస్తే కొన్ని సినిమాలు నష్టాలను మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు.
పోటీ వల్ల లింగ సినిమాను ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయాల్సి వచ్చిందని నట్టి కుమార్ అన్నారు.
నాకు సినిమాలతో పాటు వేరే వ్యాపారాలు ఉన్నాయని నట్టి కుమార్ తెలిపారు.మా పిల్లలతో తీసిన సినిమాలు ప్రేమతో తీసిన సినిమాలే తప్ప డబ్బు ఆశించి తీసిన సినిమాలు అయితే కాదని నట్టి కుమార్ వెల్లడించారు.
సినిమా ఫీల్డ్ లో టాలెంట్ తో పాటు లక్ ఉండాలని నట్టి కుమార్ కామెంట్లు చేశారు.
నా కూతురు నటించిన సినిమా యావరేజ్ గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.నా కూతురు సైకాలజీ చదివిందని ఆమెకు ఆసక్తి ఉంటే సినిమాల్లో కొనసాగనిస్తానని నట్టి కుమార్ వెల్లడించారు.జనాలకు నచ్చే సినిమా తీయాలని భావించి ఆ సినిమా తీశామని నట్టి కుమార్ అన్నారు.
నట్టి కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.