సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ).మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.అందులోను ఇది సూపర్ హిట్ కాంబోలో తెరకెక్కుతున్న నేపథ్యంలో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.నవంబర్ పూర్తి అయ్యే సరికి షూట్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు.దీంతో ఫస్ట్ సింగిల్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.దసరా పండుగకే వస్తుంది అనుకున్నారు.
కానీ రాలేదు.అయితే ఈసారి దీపావళికి పక్కా అని ముందు నుండి వార్తలు వస్తున్నాయి.
మరి ఎట్టకేలకు ఇప్పుడు డేట్ అఫిషియల్ గా వచ్చింది.
ఈ సినిమా సాంగ్ బిట్ నిన్న రాత్రి వైరల్ అయ్యింది.ఇక దీనిపై సోషల్ మీడియాలో చాలానే డిస్కర్షన్ జరుగుతుంది.ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ఒక డేట్ ప్రకటించి బ్లాస్టింగ్ సింబల్స్ పెట్టి వదిలేసారు.
నవంబర్ 7న అప్డేట్ అంటూ తెలిపారు. గుంటూరు కారం పేరు మెన్షన్ చేయకపోయినా ఈ అప్డేట్ ఇదే అని అందరికి అర్ధం అయిపోయింది.మరి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.కాగా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.