సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల ఎస్ఐ బాలకృష్ణ( SI Balakrishna ) అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఓటు వేయాలని లేకుంటే మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ యువకులను చితకబాది,మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ చౌటపల్లి గ్రామస్థులు, మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మహిళలు శుక్రవారం రాత్రి హుజూర్ నగర్ ఎన్నికల అధికారి జగదీశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.ఎన్నికల విధులు నిర్వహించాల్సిన ఎస్ఐ,అధికార పార్టీకి కార్యకర్తగా ప్రజలను భయపెడుతున్నారని,ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Latest Suryapet News