ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రెమ్యూనరేషన్ కీ సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్ కి సంబంధించి తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే ఎంతోమంది దర్శకులు నిర్మాతలు హీరోల రెమ్మలనేషన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా కూడా ఒక నిర్మాత హీరోల రెమ్యూనరేషన్ పై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆయన మరెవరో కాదు టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూషణ్ కుమార్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా కొందరు యాక్టర్స్ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.తర్వాత ప్రొడ్యూసర్ అనేవాడు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ ఆవేదన చెందారు.
సినిమా బడ్జెట్ లో సగం హీరోల రెమ్యూనరేషనే ఉంటోంది అంటూ అసహనం వ్యక్తం చేశారు భూషణ్ కుమార్.కాగా ఇదే విషయంపై గతంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన విషయం తెలిసిందే.

తాజా భూషణ్ కుమార్ కూడా ఇదే విధంగా హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో కొందరు హీరోలు ప్రొడ్యూసర్స్ ను బాగా అర్థం చేసుకుంటారు.ఎలాంటి డిమాండ్ చేయరు.కానీ కొందరు హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా భారీ మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నారు.ఒక్క హీరోకే రూ.20 నుంచి రూ.25 కోట్ల దాకా ముట్టజెప్పాల్సి వస్తోంది.ఒక వేళ సినిమా ఆడకపోతే తీవ్రస్థాయిలో నష్టాలు చూస్తున్నాం.

తలకు మించి భారం మోయడం ఎందుకని మేమూ కూడా కఠినంగా ఉంటున్నాము.కొన్ని సందర్భాల్లో నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు భూషణ్ కుమార్.కాగా ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భూషణ్ కుమార్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఇదే విషయంపై అనేకసార్లు వార్తల వినిపించిన సంగతి తెలిసిందే.







