తెలుగు ప్రేక్షకులకు నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు బండ్ల గణేష్.అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా సోషల్ మీడియాలో వినిపించే పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి అని చెప్పవచ్చు.
సినిమాలలో నటించకపోయినప్పటికీ బండ్ల గణేష్ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు.కాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, భక్తి అని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై సినిమాల పరంగా కానీ లేదంటే రాజకీయపరంగా కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లైవ్ మీడియాలోకి వచ్చి మరి తిట్టేస్తూ ఉంటాడు.సోషల్ మీడియాలో వారిపై సెటైర్లు వేస్తూ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు బండ్లన్న.కేవలం సినిమాలలో నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
పవన్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించగా అందులో తీన్‌మార్ సినిమా నిరాశపరచగా, గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీలతో సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయాడు బండ్ల గణేష్.
2015లో ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమా తర్వాత మరే సినిమాను ప్రొడ్యూస్ చేయలేదు.అయితే ఈ మధ్యన డేగల బాబ్జీ అంటూ హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు.అలాగే మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇండియాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తో మరో సినిమా నిర్మించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆ వార్తలు నిజం లేదు అని కొట్టి పారేస్తూ వస్తున్నాడు బండ్ల గణేష్.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాలలో కొన్ని సెట్స్ పైకి వెల్లగా కొన్ని ఇంకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీబిజీగా మారిపోవడంతో ఆ సినిమాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది.ఈ క్రమంలో పవన్‌తో సినిమా పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్.తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన బండ్లన్నను ఒక అభిమాని గణేశ్ అన్నా.
పవన్ కల్యాణ్ గారితో ఒక సినిమా చేయాలి.మీరెప్పుడు చేస్తారు.
పీఎస్‌పీకే ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అని ప్రశ్నించాడు.ఆ ట్వీట్ పై స్పందించిన బండ్ల గణేష్.
బాస్ కాబోయే సీఎం.ఇక సినిమాలు లేవు అంటూ రిప్లై ఇచ్చాడు బండ్ల.