కడప లోక్‌సభ సెగ్మెంట్‌లోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.2009లో చివరిసారిగా టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోగా.ఆ తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచింది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండు సార్లు గెలిచి 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 45 వేల ఓట్ల మెజార్టీని సాధించారు.
అయితే నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.ఎమ్మెల్యే ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు.రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన బావ మునిరెడ్డి మాత్రం డిఫాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.నియోజకవర్గంలోని అన్ని పనులను ముని రెడ్డే చూసుకుంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.అయితే మునిరెడ్డి నియోజకవర్గంలో తన ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
అధిష్టానం, అధికారులతో పాటు నియోజకవర్గంలోని ప్రజలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.రాచమల్లు రెండోసారి విజయం సాధించడంలో యాక్సెసిబిలిటీ కీలక పాత్ర పోషించింది కానీ అది ఇప్పుడు సమస్యగా మారింది.
ఎమ్మెల్యే ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల పార్టీ క్యాడర్‌లో ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కూడా చేరింది.
అభ్యర్థిని మార్చకుంటే 2024లో టీడీపీ మళ్లీ ఇక్కడికి గెలవచ్చని స్థానిక నాయకులు అంటున్నారు.

ప్రొద్దుటూరు మాత్రమే కాక ఏపీలోని చాలా నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగానే ఉంది.చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.దీంతో వారిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది.
ఈ విధంగానే ఎమ్మెల్యేల పరిస్తితి కొనసాగితే చాలా నియోజకవర్గాలలో పార్టీ ఓటమిని ఎదురుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ మరింత ఫోకస్ పెట్టాలని స్థానికి నాయకులు అభిప్రాయపడుతున్నారు.