సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు ఆరుపదుల వయసు దాటినా కూడా ముసలివారు అవుతున్నా కూడా హీరోలకు హీరో అనే ట్యాగ్ ఉంటుంది.కాగా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఉదాహరణగా తీసుకుంటే సల్మాన్ ఖాన్,రజనీకాంత్ కమలహాసన్, చిరంజీవి,ఇలా ఎంతో మంది హీరోలు ఐదు పదుల వయసు దాటి ఆరుపదుల వయసుకు చేరువగా ఉన్నప్పటికీ హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు.కానీ హీరోయిన్ ల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు.
హీరోయిన్ కొత్త గ్యాప్ తీసుకున్నా లేదంటే పెళ్లి తర్వాత మళ్ళీ రిఎండ్రీ ఇచ్చిన వాళ్లకు హీరోయిన్ అనే ట్యాగ్ను తీసేస్తూ ఉంటారు.
అప్పుడు హీరోయిన్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదంటే మదర్ క్యారెక్టర్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనే ముద్ర పడుతుంది.
అయితే ఈ విషయం తమను టార్చర్ కి గురిచేస్తుంది అని అంటుంది సీనియర్ నటి రవీనా టాండన్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
మీడియాతో రవీనా మాట్లాడుతూ హీరోలు ఒక్కొక్క సినిమాకు రెండు నుంచి మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు.కానీ హీరోయిన్లు మాత్రం కొద్దిరోజులు గ్యాప్ తీసుకుంటే చాలు సెకండ్ ఇన్నింగ్స్ అనే ముద్రను వేస్తారు.
ఎందుకు అని ఆమె ప్రశ్నించింది.మాధురి దీక్షిత్ 90 ల కాలంలో సూపర్ స్టార్ అంటూ మీడియాలో కథనాలు వినిపించాయి వచ్చాయి.

మరీ సల్మాన్ ఖాన్,సంజయ్ దత్ లు కూడా ఆ కాలం నాటికి చెందిన వారేగా వారిని ఎందుకు అలా అనరు.ఇప్పటికీ హీరోలు గానే పరిగణిస్తూ ఉన్నారు.కానీ హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అని ఆమె తెలిపింది.మరి రవినా ఆవేదన పట్ల సినీ ఇండస్ట్రీలో వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.అంతేకాకుండా ఆమె విషయంలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రస్తావిస్తుండటం వల్లే ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది.మరి ఈ విషయంపై హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.







