టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి అందరికీ పరిచయమే.విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ .
కానీ ఇందులో తన పాత్రతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయింది.
దీంతో అవకాశాల కోసం తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ప్రియాంక.సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేస్తుంది.
మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.అలా తొలిసారిగా 2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాతో అంతగా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది ప్రియాంక.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలాలో నటించింది.
ఆ తర్వాత తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక వెంటనే వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈ బ్యూటీ మొదట్లో చూడడానికి అంత అందంగా ఆకట్టుకోలేకపోయినా.
ఇప్పుడు మాత్రం తెగ గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.నిజానికి గతంలో తాను తన అందం గురించి కూడా ఓపెన్ కామెంట్లు చేసింది.
తన మేకప్ వల్లే తను అందంగా ఉన్నానని తెలిపింది.తన అందం విషయంలో తను చాలా ట్రోల్స్ కూడా ఎదుర్కున్నానని.
అవి తట్టుకోలేక అందం విషయంలో మరింత నాజూగ్గా, గ్లామర్ గా కనిపించాలని ప్రయత్నించినప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని తెలిపింది.

ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల జాగ్రత్త తీసుకొని సన్నబడినానని తెలిపింది.అలా ప్రస్తుతం తన అందంతో బాగా గ్లామర్ షో చేస్తుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ అభిమానులను బాగా ఫిదా చేస్తుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.అందులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
నిత్యం ఏదో ఒక ఫోటో తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తను రెడ్ కలర్ శారీలో తన అందాలతో మతి పోగొట్టింది.
నిజానికి ఈ బ్యూటీ ఈ చీరలో చాలా అందంగా కనిపించగా కుర్రాళ్ల మతి పోగొట్టింది.ఇక ఆ ఫోటో షేర్ చేసుకున్న కొన్ని క్షణాల్లోనే బాగా వైరల్ అయింది.
ఇక ఈ ఫోటోను చూసిన తన ఫాలోవర్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.అందులో చూడటానికి తాను అచ్చం కాజల్ అగర్వాల్ లో ఉండటంతో ఓ నెటిజన్ వెంటనే తనను అచ్చం కాజల్ అగర్వాల్ లో ఉన్నావు అంటూ పొగిడాడు.
ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







