పవన్ తో సినిమా చేయను.. ఎన్టీఆర్ కు పడిపోయా.. నటి సంచలన వ్యాఖ్యలు?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా మంచి పేరు సంపాదించుకుని స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు.అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ట్యాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

 Priyanka Jawalkar Comments About Pawan And Ntr Details Here Goes Viral , Priyank-TeluguStop.com

తాజాగా ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానినని ఆమె అన్నారు.

పవన్ నటించిన తమ్ముడు మూవీని 20 సార్లు చూశానని పవన్ అంటే పిచ్చి అని ప్రియాంక జవాల్కర్ అన్నారు. ఖుషి సినిమాలో పవన్ చెప్పిన ప్రతి డైలాగ్ నాకు గుర్తుందని రియల్ లైఫ్ లో సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ అంత సింపుల్ గా ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం కాదని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు.

పవన్ కు జోడీగా ఛాన్స్ వచ్చినా నేను చేయనని తాను పవన్ కు ఎప్పటికీ అభిమానినే అని ప్రియాంక తెలిపారు.

పవన్ కళ్యాణ్ ను దూరం నుంచి చూస్తూ ఆయన ఫ్యాన్ గా నేను మిగిలిపోతానని ప్రియాంక జవాల్కర్ కామెంట్లు చేశారు.బన్నీ హీరోగా తెరకెక్కిన ఆర్య మూవీ అంటే ఎంతో ఇష్టమని అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ కు నేను పడిపోయానని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు.మణిరత్నం సినిమాలో చిన్న రోల్ దక్కినా చాలని ఆమె కామెంట్లు చేశారు.

సినిమాల్లోకి రాకపోతే చెఫ్ లేదా పైలట్ అయ్యేదానినని ప్రియాంక జవాల్కర్ కామెంట్లు చేశారు.సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే సహనంతో పాటు ఓపిక ఉండాలని ప్రియాంక చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని ఆమె కామెంట్ చేశారు.ప్రియాంక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube