అనకాపల్లి జిల్లా యలమంచిలిలో దారుణ హత్య జరిగింది.ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశారు.
అనంతరం మృతుడు శరీర భాగాలను అక్కడక్కడ విసిరేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కొత్తపాలెం బ్రిడ్జి, చెరుకు కాటా వద్ద కొన్ని శరీర భాగాలను స్థానికులు గుర్తించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న హతుడి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
కాగా ఈ హత్యతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.







