డైరెక్టర్ నవీన్ ఇరగాని దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హసీనా.( Haseena Movie ) ఈ సినిమాలో అభినవ్, ప్రియాంక డెయ్,( Priyanka Dey ) థన్వీర్,(Thanveer ) సాయి తేజ గంజి, శివగంగా, ఆకాష్ లాల్ వంటి కొత్త నటీనటులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు.
ఇక ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహనిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో అభి (అభినవ్) స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వంటి దండాలు చేస్తూ ఉంటాడు.
ఇక ఇతడికి సీఐ సపోర్టు కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలో అడ్డొచ్చిన వాళ్లందర్నీ హత్య చేస్తూ ఉంటాడు.
అయితే అభి ఓ సమయంలో ఏ సి పి తో గొడవ పెట్టుకుంటాడు.ఇక మరోవైపు హసీనా (ప్రియాంక డెయ్), థన్వీర్, సాయి, శివ, ఆకాష్ ఈ ఐదుగురు అనాధలు.
దీంతో వీరంతా కలిసి ఉంటారు.అంతేకాకుండా వీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా సంపాదిస్తారు.
అయితే హసీనా వల్ల మిగతా నలుగురు జీవితాలలో కొన్ని మార్పులు వస్తాయి.ఇక ఈ ఐదుగురికి అభితో ఉన్న సంబంధం ఏంటి.
హసీనా చివరికి ఏం చేస్తుంది.అసలు అభి ఏసీపీతో ఎందుకు గొడవ పడతాడు.
చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే.ఈ సినిమాతో అభినవ్, ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివగంగా, ఆకాష్ లాల్ కొత్తగా పరిచయం అయినప్పటికీ కూడా.తమ పర్ఫామెన్స్ తో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారని చెప్పాలి.
అనుభవమున్న నటీనటులుగా తమ పాత్రలతో మెప్పించారు.ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికొస్తే డైరెక్టర్ ప్రేక్షకులకు కొత్త నటులతో మంచి కథను పరిచయం చేశాడని చెప్పాలి.ఈ సినిమాను చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
పాటలు పరవాలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
డైరెక్టర్ నవీన్ ఈ సినిమాను కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.చాలావరకు ట్విస్టులతో కూడిన సన్నివేశాలు చూపించాడు.అంతేకాకుండా సైబర్ మోసాలు, అకౌంట్ లో నుంచి డబ్బులు మిస్ అవ్వటం, ఫోన్లు ఎలా హ్యాక్ చేస్తారు అనే వాటిపైనే కాకుండా స్నేహితులు అనేది ఎలా ఉండాలి.
ఎలా ఉండకూడదు అన్న పాయింట్ తో ముందుకొచ్చాడు.ఫస్టాఫ్ కాస్త స్లోగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం బాగా ట్విస్ట్ లతో సాగింది.
ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్, ట్విస్టులు, క్లైమాక్స్, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ బోరింగ్, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ట్విస్టులను ఇష్టపడే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.