ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్ రింగ్ ఖరీదు అన్ని కోట్లా?

మన దేశంలోని మోస్ట్ లవబుల్ కపుల్స్ జాబితాలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ముందువరసలో ఉంటారు.

దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ప్రియాంక నిక్ ల వివాహం జరిగింది.

ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలలో ఎక్కువగా తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు.తాజాగా ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్ రింగ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

అటు ప్రియాంక చోప్రా ఇటు నిక్ జోనస్ ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.తాజాగా ప్రియాంక చోప్రా తనకు ఎంగేజ్ మెంట్ రింగ్ ఇష్టమైన ఆభరణం అని చెప్పుకొచ్చారు.

ఎంగేజ్ మెంట్ రింగ్ గురించి ఈ విధంగా చెప్పకపోతే తన భర్త తనను చంపేస్తాడని ప్రియాంక కామెంట్లు చేశారు.తాను ఏవైతే ఆభరణాలను ధరిస్తానో వాటి విషయంలో సెంటిమెంట్ తో ఉంటానని ప్రియాంక తెలిపారు.

Advertisement

తాను ధరించే ఎంగేజ్ మెంట్ రింగ్ జ్ఞాపకాలతో ముడిపడి ఉందని ప్రియాంక చోప్రా కామెంట్లు చేశారు.

పెళ్లి సమయంలో ఎంగేజ్ మెంట్ రింగ్ ద్వారా ఈ జంట వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఎంగేజ్ మెంట్ రింగ్ ధర 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.ఈ రింగ్ ఖరీదు తెలిసి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం ఆశ్చర్యపోవడంతో పాటు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఎంగేజ్ మెంట్ రింగ్ కు సంబంధించి చనిపోయిన తన తండ్రి కి కనెక్షన్ ఉందని ఆమె పేర్కొన్నారు.నిక్ జోనస్ సైతం పలు సందర్భాల్లో ఈ ఎంగేజ్ మెంట్ రింగ్ గురించి చెప్పుకొచ్చారు.టిఫనీస్ నుంచి కొనుగోలు చేసిన ఈ రింగ్ గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు