డబల్ మీనింగ్ యాడ్ పై ప్రియాంక చోప్రా ఫైర్.. అంతపెద్ద డైలాగ్ ఏముందంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లేయర్ షాట్ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ యాడ్ క్రియేటివిటీ లో భాగంగా కాస్త హద్దులు దాటింది.

అయితే ఒక యాడ్ ని షూట్ చేసిన తర్వాత ఆ యాడ్ లో చిన్న చిన్న మిస్టేక్ లను ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు.కానీ లేయర్ షాట్ అనే ఒక బాడీ స్ప్రే కు సంబంధించిన యాడ్ ని చూసిన ప్రేక్షకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ యాడ్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందంటే.

ఓ నలుగురు కుర్రాళ్లు సూపర్ మార్కెట్‌కు వస్తారు.వారి ముందు నుంచి ఓ అమ్మాయి వెళ్లగా.

Advertisement

అప్పుడు ఆ నలుగురు కుర్రాళ్లు మనం నలుగురం ఉన్నాం.కానీ అక్కడ ఒక్కటే ఉంది.

మరి షాట్ ఎవరు వేస్తారు అని నలుగురు అబ్బాయిలు మాట్లాడుకోవడంతో అమ్మాయి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూడగా లేయర్ షాట్ అనే బాడీ స్ప్రే ఉంటుంది.దీంతో ఊపిరి ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుంటుంది.

అయితే ఈ యాడ్ మాత్రం దరిద్రంగా ఉందని, రేప్‌ను ప్రోత్సహించేలా డబుల్ మీనింగ్ డైలాగ్‌తో ఉందని అందరూ మండిపడుతున్నారు.మహిళా కమిషనర్ కూడా ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రసార మంత్రిత్వ శాఖ సైతం దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

సదరు సంస్థ కూడా తలొంచింది.తాము చెడు ఉద్దేశ్యంతో ప్రకటన చేయలేదని క్షమాపణలు చెప్పింది.యూట్యూబ్‌లో ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను తొలగించారు.

Advertisement

ఇప్పటికీ ఇదే విషయంపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ ప్రకటనపై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పందింస్తు మండిపడింది.

సిగ్గుగా ఉంది.ఎంతో దారుణమిది.

యాడ్ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మధ్యలో ఎంతో మంది క్లియరెన్స్ ఇచ్చి ఉంటారు.ఇది సరైనదేనా అని ఎంత మంది ఆలోచించారు? మొత్తానికి ఈ యాడ్‌ను రద్దు చేశారు.మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ వేసింది ప్రియాంక చోప్రా.

తాజా వార్తలు