సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియమణి ( Priyamani ) ఒకరు ప్రస్తుతం ఈమె హీరోయిన్గా కాకుండా సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా నయనతార షారుఖ్ ఖాన్ కలిసి నటించిన జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ విధంగా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నటువంటి ప్రియమణి గురించి సోషల్ మీడియాలో కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.ముఖ్యంగా చాలామంది ఈమెను ఆంటీ ( Aunty ) అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

గతంలో కూడా చాలామంది ప్రియమణి హాట్ ఫోటోలపై బ్లాక్ ఆంటీ అంటూ కామెంట్ చేసే వారు.తాజాగా మరొక నెటిజన్ కూడా అదే విధంగా కామెంట్ చేయడంతో ఈ కామెంట్ పై స్పందించినటువంటి ప్రియమణి ( Priyamani ) సదరు నేటిజనుకు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఇలా ఆంటీ అన్న నేటిజన్ కు ప్రియమణి సమాధానం చెబుతూ.ప్రస్తుతం నా వయసు 38 సంవత్సరాలు ఆయన నేను చాలా హాట్ ముందు నువ్వు నోరు మూసుకో అంటూ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
ఇక నన్ను ప్రతి ఒక్కరూ ఆంటీ అని పిలిచినా నాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని ఈమె తెలిపారు.

ప్రతి ఒక్కరి జీవితంలోను వయసు పెరగడం అనేది సర్వసాధారణంగా జరిగే సహజ ప్రక్రియ అలాంటి సమయంలో నన్ను ఆంటీ అనడంలో తప్పులేదు అంటూ ఈ సందర్భంగా ఈ విషయంపై చాలా పాజిటివ్గా ప్రియమణి స్పందించడంతో చాలామంది ఈమె ఆలోచనలపై ప్రశంసల కురిపిస్తున్నారు.చాలామంది ఆంటీ అంటేనే ఇంత ఎత్తున ఎగిరి పడతారు అయితే మీరు మాత్రం ఇలా పాజిటివ్ గా ఆలోచించడం గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.గతంలో కూడా ఈ ఆంటీ వివాదాన్ని అనసూయ ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.
ఆ సమయంలో ఈమె ఏకంగా నెటిజన్లపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు.తాజాగా ప్రియమణికి సైతం ఈ విధమైనటువంటి ట్రోల్స్ తప్ప లేదని తెలుస్తుంది.