ప్రముఖ నటీమణులలో ఒకరైన ప్రియా భవానీ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.డబ్బు కోసమే తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఆమె పేర్కొన్నారు.
బుల్లితెర ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్ కూడా వెండితెరపై కూడా ఒక వెలుగు వెలగాలని భావిస్తున్నారు.ప్రియా భవానీ శంకర్ నటించిన తొలి సినిమా మేయాదమనే అంచనాలను మించి సక్సెస్ సాధించింది.
ఆ తర్వాత ఈ నటికి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తుండగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఈ నటి స్థాయిని మరింత పెంచాయి.ఇండియన్2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.భవిష్యత్తు విషయంలో తనకు ఎలాంటి ఆలోచనలు లేవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.నటిగా ప్రేక్షకాదరణను పొందుతానా? లేదా? అని నేను చెప్పలేనని ఆమె పేర్కొన్నారు.
నటిస్తే డబ్బు వస్తుందని అనుకున్నానని ఆ రీజన్ వల్లే నటించడానికి వచ్చానని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నాయని ప్రియా భవాని శంకర్ తెలిపారు.సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే తామేంటో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.తాను ఇంకా ఎక్కువగా శ్రమించాలని అనుకుంటున్నానని ప్రియా భవాని శంకర్ తెలిపారు.
ప్రియా భవాని శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ హీరోయిన్ కు ఆటిట్యూడ్ ఎక్కువ అని కామెంట్లు చేస్తున్నారు.ప్రియా భవాని శంకర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కళ్యాణం కమనీయం సినిమాతో ప్రియా భవాని శంకర్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.
ఈ హీరోయిన్ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వరుస విజయాలతో ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని తెలుస్తోంది.