ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ప్రదాని అయిన మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఏపీకీ ప్రత్యేక హోదా ప్రకటించారు.అయితే ఈ అంశాన్ని విభజన చట్టంలో మాత్రం చేర్చలేదు.
దానికి తోడు 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా భారీగా పతనం అయింది.దాంతో ప్రత్యేక హోదా మాట అటకెక్కింది.
అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు.ఇటు రాష్ట్రంలోని పార్టీలు సైతం ఆమాటను మర్చిపోయాయి.
ఇక ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో.ఒక్కొక్క పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి.
విభజన హామీల మాటు 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీతో పాటు 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ పార్టీ కూడా పక్కన పెట్టేసింది.అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలంగా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
టీడీపీ అధినేత చంద్రబాబును ప్రత్యేక ప్యాకేజీకి ఓప్పించారు.దాదాపు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి సైతం బీజేపీ ఒప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే రాష్ట్ర విడిపోయి దాదాపు తొమ్మిదేళ్లు గడుస్తున్నా.కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందలు కోట్లు మాత్రమే.
అదికూడా రాజధాని ప్రాంతంలో డ్రైనేజీ పనులు, రోడ్ల కోసం కేటాయించినదే.

దాంతో బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో ఆ విషయం పై పెద్దగా మాట్లాడటం లేదు.లోక్ సభతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.ఏపీపై కొన్ని వరాలు కురుస్తాయని భావించారు.
అయితే మరోసారి కేంద్రం ఏపీకి మొండి చేయి చూపించింది.ఆ విషయం ఎలా ఉన్నా.
ఏపీ నేతలకు మాత్రం ఇన్నాళ్లుకు మరోసారి ప్రత్యేక హోదా అంశం గుర్తుకు వచ్చింది.అందుకే ఏకంగా పార్లమెంటులో ప్రత్యేక హోదా విషయంపై ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతామని ప్రకటించారు.

అయితే.ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ మోకరిల్లే.ఏపీ నేతలు ఇప్పుడు బీజేపీకి ఎదురు నిలబడతారా అనేది కొత్త ప్రశ్న.అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు, ఢిల్లీ, పంజాబ్ కు సబంధించిన ఆప్ నేతలు, తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వడానికి సిద్ధ పడినట్టు తెలుస్తోంది.
అందుకే ఏపీ నేతలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది.ఒక వేళ నిజంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో నెగ్గితే.బీజేపీ ఇజ్జత్ దేశ వ్యాప్తంగా పోవడం పక్కా.మరి బీజేపీ నేతలు ఈ సంకటాన్ని ఎలా ఎదుర్కుంటారు అనేది ఆసక్తిగా మారింది.







