తెలుగు ఆడియెన్స్ గ్రేట్ అంటూ పొగిడేసిన ప్రిన్స్!

తమిళ్ హీరో శివకార్తికేయన్ హీరోగా బ్రిటీష్ భామ మరియా ర్యాబోష హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా ప్రిన్స్.జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి ఈ సినిమాను తెరకెక్కించాడు.

 Prince Telugu Movie Pre Release Event Details, Sivakarthikeyan, Prince Pre Relea-TeluguStop.com

జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన నెక్స్ట్ చేస్తున్న ప్రిన్స్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా ప్రొమోషన్స్ బాగా చేస్తూ జనాలకు చేరువ చేసారు.

ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విచ్చేశాడు.ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా కోసం హీరోయిన్, డైరెక్టర్ దగ్గర నుండి నిర్మాతల వరకు అందరు కష్టపడ్డారు అని.ఇక థమన్ అందించిన సంగీతం బాగా రావడంతో సినిమాపై మంచి క్రేజ్ తీసుకు వచ్చింది అంటూ తెలిపారు.ఇక తెలుగు ఆడియెన్స్ గురించి చెప్పాలి అంటే.భాషతో సంబంధం లేకుండా మీరు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తప్పకుండ ఆదరిస్తారు.

Telugu Anudeep Kv, Kollywood, Prince, Prince Pre, Sivakarthikeyan, Tollywood-Mov

అలాగే ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తారు అని.ఇటీవలే తన డాన్, డాక్టర్ సినిమాలు బాగా ఆదరించారని ఇక ఇప్పుడు ప్రిన్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.ఇక పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube