ఆ రోజు ఏపీలో ప్రధాని పర్యటన ! తెలంగాణ ' ఫలితం '  కోసమేనా ?

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురువేయాలనే పట్టుదలతో ఉన్న బిజెపి( BJP ) అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.కేంద్ర బీజేపీ కీలక నాయకులంతా తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు.

 Prime Minister's Visit To Ap That Day For Telangana 'result' , Modhi, Telanga-TeluguStop.com

బిజెపికి చెందిన కీలక నాయకులు కొన్ని కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలను( BRS Congress party ) టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.  ఇక ప్రధాని నరేంద్ర మోది సైతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

ఇది ఇలా ఉంటే తెలంగాణ ఎన్నికల పై ఎఫెక్ట్ చూపించేలా,  ఏపీలో మోది పర్యటన ఉండబోతున్నట్లు సమాచారం.  ఈనెల 28వ తేదీతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిస్తుంది.

Telugu Bjp Congress, Modhi, Modhi Ap, Modhi Tirupathi, Telangana-Politics

ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరు తెలంగాణలో ఉండేందుకు అనుమతి ఉండదు.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోలింగ్ తేదీ రోజున పక్క రాష్ట్రం ఏపీలో పర్యటించాలని ప్రధాని మోడీ ( Narendra Modi )నిర్ణయించుకున్నారట.  ఎప్పుడు లేని విధంగా మూడు రోజులపాటు తిరుపతిలో ప్రధాని ఉందనున్నట్టు సమాచారం.ఈనెల 28 ,29, 30 తేదీల్లో మోది తిరుమల తిరుపతిలో పర్యటిస్తారని అధికార వర్గాలకు సమాచారం వచ్చిందట.

ఈనెల 28వ తెలంగాణలో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది.ఆ రోజున తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రధాని తిరపతికి చేరుకుంటారట.29న తిరుపతిలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.తిరుమల లో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తెలంగాణ పోలింగ్ రోజు 30వ తేదీన ఉదయం తిరుమల నుంచి ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

  తిరుపతిలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారట.

Telugu Bjp Congress, Modhi, Modhi Ap, Modhi Tirupathi, Telangana-Politics

 అదే రోజు సాయంత్రం ఆయన తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత నుంచి పోలింగ్ తేదీ వరకు ఏపీలో మోది పర్యటిస్తే ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందని బిజెపి అంచనా వేస్తోందట.  అందుకే ఈ వ్యూహాన్ని ఆలోచించినట్లు అర్థం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube