ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పర్యటన ఖరారైంది.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ను పీఎంవో విడుదల చేసింది.
పర్యటనలో భాగంగా ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకోనున్నారు.ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లనున్నారు.ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు.కాగా ప్రధాని అధికారిక పర్యటన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు.అనంతరం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఈ పర్యటనలో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.
తరువాత సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు.







