చిలకలూరిపేటలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, వైసీపీ పార్టీలు రెండు వేరువేరు కావు.
ఈ రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది ఒకే కుటుంబానికి చెందినవారు.కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వ్యతిరేక ఓటు చీలకుండా కూటమికి వెయ్యాలి అని మోదీ సూచించారు. వైసీపీ ( YCP ) పార్టీకి చెందిన మంత్రులు అవినీతి అక్రమాల్లో పోటీపడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నికలలో ప్రజలు పెకిలించాలని పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు.ఎన్డీఏ ప్రభుత్వం( NDA Govt ) పేదల కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.‘పీఎం ఆవాస్ యోజన ( PM Awas Yojana )కింద ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇస్తే.పల్నాడులో 5వేల ఇళ్లు ఉన్నాయి.జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం.ఆయుష్మాన్ భారత్ కింద ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది.కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం.రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి’ అని పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఏపీ ప్రజలు 2 సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం.రెండో సంకల్పం రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం.ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలని పేర్కొన్నారు.







