వచ్చే నెల నుంచి ధరల విషయంలో భారీ మార్పులు... మొబైల్స్ నుంచి బంగారం వరకు గ్రాఫ్ ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.2023 ఏప్రిల్ 1 నుంచి దేశమంతటా కొన్ని వస్తువులపై ధరలు ( Prices ) భారీగా పెరగనున్నాయి.ఈ క్రమంలోనే మరికొన్ని వస్తువులపై ( Goods ) ధరలు కాస్త తగ్గనున్నాయి.విషయం ఏమంటే దేశీయ పరిశ్రమలకు మద్దతుగా దిగుమతి సుంకాలను( Import Duty ) పెంచే యోచనలో కేంద్రం వుంది.

 Prices Of These Goods Changes From April 1st Details, April, April Month Changes-TeluguStop.com

ఈ కారణంగానే ధరలలో కొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, జ్యువలరీకి సంబంధించిన వస్తువులు,

హై-గ్లోస్ పేపర్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీల ధరలు భారీ స్థాయికి చేరుకోగా కెమెరా లెన్స్‌, స్మార్ట్‌ఫోన్‌, సైకిళ్ళు, బొమ్మలు ధరలు తగ్గనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ప్రజెంటేషన్‌లో బట్టలు, ఫ్రోజెన్ స్క్విడ్, ఫ్రోజెన్ మస్సెల్స్, ఇంగువ, కోకో గింజలపై కస్టమ్స్ పన్నులను తగ్గిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా.

ఎసిటిక్ యాసిడ్, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కెమెరా లెన్స్‌లపై దిగుమతి పన్నులు తగ్గుముఖం పట్టాయి.వచ్చేనెలనుండి ఎలక్ట్రానిక్ చిమ్నీలు, జ్యువెలరీ వస్తువులు, బంగారం, ప్లాటినం, వెండి పాత్రలు, దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారే అవకాశం వుంది.

ఇదే సమయంలో కొన్నిటిపైన ధరలు తగ్గే అవకాశము కలదు.అవేమంటే… బొమ్మలు, సైకిళ్ళు, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎల్ఈడీ టీవీలు, కెమెరా లెన్సులు తదితర వస్తువులపైన ధరలు తగ్గనున్నాయి.కాబట్టి వీటిని కొనాలనుకునే వారు వచ్చేనెల దాకా ఆగితే బావుంటుంది.ఇంకా మూడురోజుల్లోనే వచ్చే నేలలోకి అడుగుపెట్టనున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube