కెరియర్ తొలినాల్లలో ఎంత కష్టపడుతున్నారో కొంతమంది హీరోయిన్స్ సీనియర్స్ గా మారిన తర్వాత కూడా అదే రేంజ్ లో వర్కౌట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.ఇది సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం గురించి చెప్తున్న మాట.
ఉదాహరణకు జ్యోతిక, ప్రియమణి లాంటి హీరోయిన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే వీరిద్దరిని సూపర్ సీనియర్ హీరోయిన్స్ గానే పరిగణించవచ్చు.ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మళ్లీ సినిమాలు కూడా మొదలుపెట్టి సక్సెస్ అందుకున్నారు.
మామూలుగా అయితే వీరి గురించి పెద్దగా మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు.కానీ 2024లో బంపర్ హిట్స్ కొట్టి తమ సత్తా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేశారు.

అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం మలయాళ సినిమాల్లో నటించిన జ్యోతిక( Jyothika ) 2023లో మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అన్ని హిట్ సినిమాల్లో నటించింది.కాదల్ ది కోర్( Kaathal The Core ) అనే సినిమాలో మమ్ముట్టి సరసన నటించి విజయాన్ని అందుకున్న జ్యోతిక 2024లో కూడా తన హవా నీ కొనసాగించింది.సైతాన్( Shaitaan ) అనే పేరుతో హిందీలో కూడా మరో సినిమాలో నటించింది ఈ అమ్మడు.ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది.అంతేకాదు మలయాళం లో కూడా బిజీ హీరోయిన్ గా మారింది జ్యోతిక.ఒకవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు హీరోయిన్ గా నటిస్తూ అన్ని రంగాలలో విజయాలను అందుకుంటూ భయంకరమైన ఫిట్నెస్ ఫ్రీక్ అని కూడా నిరూపించుకుంది.
ఇటీవల ఆమె వర్కౌట్ చేస్తున్న వీడియోస్ చూసి మగవారి ని సైతం దడుచుకుంటున్నారు.

ఇక ఇదే కోవలో మరో సీనియర్ హీరోయిన్ ప్రియమణి( Priyamani ) కూడా తానేమీ తక్కువ తినలేదు అంటుంది.భామాకలాపం లో( Bhamakalapam ) మొట్టమొదట మెయిన్ లీడ్ గా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయగా అది మంచి విజయాన్ని అందుకోవడంతో మరోమారు దీనికి సీక్వెల్ విడుదల చేశారు.భామాకలాపం సీక్వెల్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అంతేకాదు దాని తర్వాత ఆర్టికల్ 370( Article 370 ) కూడా ప్రియమణి ఖాతాలో మంచి విజయాన్ని ఇచ్చింది.ఇప్పుడు ఆమె చేతిలో ఒక హిందీ, ఒక తమిళ్, ఒక కన్నడ సినిమా కూడా ఉండటం విశేషం.
ఇలా అన్ని భాషల్లో ఆమె ఏక చక్రాధిపత్యం చేయడం అది కూడా ఈ లేటు వయసులో ఇలాంటి ఫీట్స్ చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించడం మానదు.