అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత అరుదైన వృద్ద అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ రికార్డ్ క్రియేట్ చేశారు.బిడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే వివాదాలకు దూరంగా ఉంటారు.
అలాగే సంచలనాలకు దగ్గరగా ఉంటుంది.బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో మార్పులు జరిగాయి, ఆఫ్ఘాన్ నుంచీ తమ సేనలను వెనక్కి రప్పించేందుకు బిడెన్ చేసిన ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అలాగే బిడెన్ కొలువులో అత్యధికంగా భారతసంతతి ప్రజలకు బ్రహ్మ రథం పట్టడంతో పాటు అత్యంత కీలకమైన పదవుల్లో బిడెన్ భారతీయులను ఎంపిక చేసుకున్నారు.ఇదిలాఉంటే
బిడెన్ కు వయసు మీద పడటంతో అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతోంది.
ఈ విషయం అనేక సందర్భాలలో బిడెన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీ సారి రుజువవుతూనే ఉంది.తాజాగా బిడెన్ ఈక్వేల్ పే డే గురించి ఓ వేదికపై మాట్లాడుతున్నారు.
ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ హాజరు కాలేదు.ఎందుకంటే కమలా హారీస్ భర్త డగ్లస్ కి కరోనా సోకడంతో ఇంట్లోనే ఉన్నారని ఆయన కోలుకునే వరకూ కమలా రానని చెప్పారని అందుకే ఈ స్టేజ్ పై ఎవరు ఉండాలి అనే విషయంలో చిన్న చిన్న మార్పులు జరిగాయని అన్నారు.
ప్రధమ మహిళా భర్తకు కరోనా సోకడంతో ఈ మార్పులు చేయక తప్పలేదని వ్యాఖ్యానించారు.అయితే

బిడెన్ ఏకంగా కమలా హారీస్ ను ప్రధమ మహిళ అనడంతో ఈ విషయాన్ని గుర్తించిన సభలోని వ్యక్తి బిడెన్ తప్పును ఎత్తి చూపడంతో హాల్ లో నవ్వుల పువ్వులు పూసాయి.బిడెన్ నవ్వుతూ కమలా హారీస్ సెకండ్ లేడీ అని నాకు తెలుసు, ప్రధమ మహిళ జిల్ బిడెన్ నా భార్య, కమలా హారీస్ సెకండ్ లేడీ అంటూ తప్పును సవరించారు.ఈ విషయం పై స్పందించిన నెటిజన్లు మాత్రం మీకు టంగ్ స్లిప్ అవ్వడం కొత్తేమి కాదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







