వైద్య శాస్త్రంలో సంచలనాత్మకమైన ఆవిష్కరణకు ఇజ్రాయెల్ వేదికైంది.పరిశోధకుల బృందం HIV-AIDSను నయం చేయగల జన్యు ఆధారిత కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే హెచ్ఐవీని ఇది పూర్తిగా నయం చేయనుంది.హెచ్ఐవీ ముదిరితే ఎయిడ్స్‌కి దారి తీస్తుంది.
ఈ వ్యాధితో బాధపడేవారికి ఇజ్రాయెల్ పరిశోధకులు గుడ్ న్యూస్ అందించారు.వ్యాధిని పూర్తిగా తరిమికొట్టేలా వ్యాక్సిన్‌ను రూపొందించారు.
ఎన్నో అధునాతన ఆవిష్కరణలు జరిగినా, ఇప్పటి వరకు ఎవరూ హెచ్ఐవీకి మందు కనిపెట్ట లేకపోయారు. ఇజ్రాయెల్ పరిశోధకులు ఆ దిశగా ముందడుగు వేయడంతో ప్రపంచంలో హెచ్ఐవీతో బాధపడుతున్న వారు సంతోషపడుతున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
హెచ్ఐవీ వైరస్‌ను మొట్టమొదట సెంట్రల్ ఆఫ్రికాలోని ఒక రకమైన చింపాంజీలో కనుగొన్నారు.1800ల చివరి నాటికి మానవులలో ఇది సోకిందని శాస్త్రవేత్తల నమ్మకం.ప్రస్తుతానికి హెచ్‌ఐవి-ఎయిడ్స్‌కు ఎటువంటి నివారణ లేదు.
ఇటువంటి తరుణంలో జన్యుపరమైన చికిత్స కూడా ఉనికిలో లేదు.HIV వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది.
ఫలితంగా ఏదైనా అనారోగ్యం తలెత్తితే దాని నుంచి బయటపడడం కష్టం.దీంతో ఏఆర్‌టీ మందులు వాడకపోతే ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడుతుంది.
ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థను పెంచే ఇంజినీరింగ్-రకం బీ తెల్ల రక్త కణాలతో టీకా అభివృద్ధి చేశారు.ఒకే టీకాతో వైరస్‌ను కట్టడి చేసే ప్రయోగాన్ని ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని ది జార్జ్ ఎస్.వైజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ బృందం ఈ పరిశోధనను చేపట్టింది.అధ్యయనం ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
ఇది ప్రతిరోధకాలను మెరుగు పరుస్తుందని, అంతేకాకుండా టీకా సురక్షితమైనది, శక్తివంతమైనది అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇది హెచ్ఐవీ మాత్రమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని వారు తెలిపారు.







