మలయాళం లో ఊదరగొట్టిన ప్రేమలు సినిమాకు తెలుగు లో అంతా సీన్ లేదని తేల్చారా ?

ఇటీవల కాలంలో మలయాళ ఇండస్ట్రీలో 100 కోట్ల సినిమాలు( 100 Crore Movies ) వస్తున్నాయి.ఇంత చిన్న ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా సినిమాలు రావడం ఈ మధ్య మొదలైంది.

 Premalu Movie Is Really Overrated ,premalu,malayalam,ott Release,karthikeya,telu-TeluguStop.com

పైగా నిన్న మొన్నటి వరకు వారికి ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ అంటే ఏంటో కూడా తెలియదు.అలాంటి వారు ఇండియా వ్యాప్తంగా వారి సినిమాలను విడుదల చేస్తున్నారు చిన్న ఇండస్ట్రీనా పెద్ద ఇండస్ట్రీనా అని పక్కనపెట్టి కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారు సినిమాలను తీస్తూ వారి స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు.

ఈ దోవలోనే ప్రేమలు( Premalu ) అనే ఒక సినిమా విడుదల అయ్యి సంచలనం సృష్టించింది కేరళలో.ఇది కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది సినిమాలో లాజిక్ చాలా చిన్నది.

ఎప్పటి నుంచి ఉన్న రొటీన్ ప్రేమ కథ అయినప్పటికి కూడా ఇది అందరి దృష్టిని బాగా ఆకర్షించింది.

Telugu Karthikeya, Malayalam, Ott, Premalu, Telugu-Movie

అక్కడ ఆ సినిమా విజయం సాధించగానే 100 కోట్లు అంత చిన్న ఇండస్ట్రీలో కలెక్ట్ చేస్తే మన తెలుగులో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అనే నమ్మకంతో రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ( SS Karthikeya ) ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు.ఇక ఇటీవలే అహ( Aha ) లో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.అయితే విడుదలైన రోజు నుంచి ఈ సినిమాకి ఎందుకో మలయాళం లో వచ్చినంత టాక్ రావడం లేదు.

మలయాళం లో కాస్త ఓవర్ రేటెడ్ గా దీనికి టాక్ వచ్చిందనే మాట ప్రస్తుతం తెలుగు నుంచి వినిపిస్తుంది.మొదట థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులు నిరాశపడ్డారు.ఇప్పుడు ఆహా లో విడుదలైన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ దొరకడం లేదు.

Telugu Karthikeya, Malayalam, Ott, Premalu, Telugu-Movie

ఈ మాత్రం ప్రేమ కథలు మన తెలుగులో బాగానే వచ్చాయి.అవి కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ అయ్యాయి.అది వేరే విషయం కానీ ప్రేమలు అయితే అంత పెద్ద సినిమా ఏమీ కాదు అని తెలుగు ప్రేక్షకులు తేల్చి పారేశారు.

మరి దీనికి 100 కోట్ల కలెక్షన్స్( 100 Crore Collections ) ఎలా వచ్చాయి అనేది అర్థం కావడం లేదు.మలయాళ ప్రేక్షకుల టేస్ట్ ఏమైనా మారుతుందా లేక తెలుగు వారికి ఈ మధ్య పెద్ద సినిమాలు చూసి చిన్న సినిమాలు ఎక్కడ ఆనడం లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube