ముల్లంగి పంట విత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

కూరగాయలలో ఒకటైన ముల్లంగి( Radish )ని అధికంగా సాంబారులో వాడుతారు.కొన్ని ఆయుర్వేద మందులలో కూడా ముల్లంగిని ఉపయోగిస్తూ ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది.

 Precautions To Be Taken While Sowing Radish Crop , Radish , Ayurvedic Medicines-TeluguStop.com

కాకపోతే రైతులకు ముల్లంగి పంట సాగు విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక పెట్టుబడి పెట్టిన అధిక దిగుబడి సాధించడంలో విఫలం అవుతున్నారు.ఈ పంట సాగు విధానంపై అవగాహన ఏర్పడిన తర్వాత సాగు చేస్తే కచ్చితంగా అధిక దిగుబడి సాధించవచ్చు అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు అంటున్నారు.

ఏ పంట సాగు చేయాలి అనుకున్న ముందుగా నాణ్యమైన విత్తన రకాల ఎంపిక కీలకం.నకిలీ విత్తనాలు ఎంపిక చేసుకొని సాగు చేస్తే.

ఎంత శ్రమించిన దిగుబడి మాత్రం పెరగదు.

Telugu Agriculture, Ayurvedic, Farmers, Radish, Radish Crop, Radish Radish-Lates

ముల్లంగిలో మేలురకం విత్తనాల రకాల విషయానికి వస్తే.గ్లోబులర్, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్, పూసా హిమని రకాలు అధిక దిగుబడి ఇస్తాయి.ఈ రకాలను సాగు చేస్తే 26 రోజులకు పంట చేతికి వస్తుంది.

మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ రకాలు విత్తుకోవడానికి చాలా అనుకూలం.ముల్లంగి పంట సాగుకు దాదాపుగా అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి.

ఇసుకతో కూడిన నేలలు, ఆమ్లం నేలలలో కూడా బాగు చేయవచ్చు.

Telugu Agriculture, Ayurvedic, Farmers, Radish, Radish Crop, Radish Radish-Lates

ముల్లంగిని పొలంలో, పొలం గట్లపై కూడా విత్తుకోవచ్చు.మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త దూరం ఎక్కువగా ఉంటే సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.విత్తిన వెంటనే ఒక తేలికపాటి నీటి తడి అందించాలి.

ఒక వారం తర్వాత నేలలోని తేమ శాతాన్ని బట్టి పంటకు నీటి తడులు అందించాలి.ముల్లంగి పంట( Radish crop )కు తీవ్రంగా నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే.

ముల్లంగి మొక్కలు మార్గోట్స్ బారిన పడే అవకాశం ఉంది.ఈ కీటకాలు మొక్క పక్కనున్న నేలలు గుడ్లు పెడతాయి.

ముల్లంగి మొక్క మూలాలలో చిన్న ఖాళీలు అలాగే పొడవైన కమ్మీలు ఏర్పడతాయి.తొలి దశలోనే వీటిని అరికట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube