సాఫ్ట్ బాల్ లో ప్రతిభతో చిన్న వయస్సులోనే గవర్నమెంట్ జాబ్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది.

ఆ టాలెంట్ ను సరైన సమయంలో గుర్తిస్తే కెరీర్ పరంగా మంచి విజయాలను సులువుగా సొంతం చేసుకోవచ్చు.

సాప్ట్ బాల్ క్రీడతో ఒక యువతి చిన్న వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం( Central Govt Job ) సాధించింది.నాలుగో తరగతి నుంచి సాఫ్ట్ బాల్ పై ఒక యువతి ఆసక్తిని పెంచుకోగా నిరంతర సాధనతో క్రీడపై పట్టు సాధించడం ఆ యువతికి ప్లస్ అయింది.

పదో తరగతి పూర్తి కాకముందే ఆ యువతి నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభ కనబరిచారంటే ఆ యువతి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది.సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపిక కావడం గమనార్హం.2017 సంవత్సరంలోనే అంతర్జాతీయ విమానం ఎక్కిన ప్రవల్లిక 15 జాతీయ, 2 అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారు.

సాఫ్ట్ బాల్ వరల్డ్ కప్ ( Softball World Cup )లో ప్రవల్లిక( Pravallika ) గోల్డ్ మెడల్ సాధించారు.మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రవల్లిక నాలుగో తరగతిలోనే క్రీడలపై ఆసక్తి చూపారు.తల్లీదండ్రుల ప్రోత్సాహంతో అండర్ 17 విభాగంలో ప్రవల్లిక రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు.

Advertisement

ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మన దేశం తరపున పాల్గొన్న ప్రవల్లిక వెండి పతకాన్ని సాధించారు.స్పోర్ట్స్ కోటాలో పంజాబ్( Punjab ) లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని ఆమె అన్నారు.14 ఏళ్లకే నాసా సందర్శించే అవకాశం దక్కిందని ప్రవల్లిక తెలిపారు.భవిష్యత్తులో సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలని ఇవే తన లక్ష్యాలని ఆమె వెల్లడిస్తున్నారు.

ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఆమె సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు