మెగా కాంపౌండ్ నుండి వచ్చి సుప్రీం హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేకపోవడం, ప్రతిరోజూ పండగే సినిమాకు మౌత్‌టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారు ఆడియెన్స్.దీంతో ఈ సినిమా తేజు కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్‌ను సాధించింది.ఈ సినిమా రెండు వారాలు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.30.33 కోట్ల వసూళ్లు సాధించింది.
రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సత్యారజ్‌ల పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక మారుతి తెరకెక్కించిన ఈ చిత్ర కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 10.81 కోట్లు
సీడెడ్ – 3.46 కోట్లు
నెల్లూరు – 0.80 కోట్లు
కృష్ణా – 1.82 కోట్లు
గుంటూరు – 1.72 కోట్లు
వైజాగ్ – 4.05 కోట్లు
ఈస్ట్ – 1.80 కోట్లు
వెస్ట్ – 1.37 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 25.83 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.00 కోట్లు
ఓవర్సీస్ – 2.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 30.33 కోట్లు







