యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా కెజిఎఫ్ సిరీన్ ను డైరెక్ట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ఈ నెలలోనే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేయగా మరో రెండు రోజుల్లోనే రిలీజ్ కానుండడంతో మరింత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక మేకర్స్ కూడా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చేసిన దేవా రోల్ ( Deva Role ) గురించి నీల్ ఆసక్తికర అంశాలు ఒకే ఒక్క మాటలో చెప్పాడు.దేవా క్యారెక్టర్ సింగిల్ లైన్ లో చెప్పాలంటే

ప్రభాస్ ముఖంలో అమాయకత్వం ఉంటుంది.అది తనలోని పసి కోణాన్ని చూపిస్తుంది.అంతేకాదు ఒక సింహాన్ని కూడా చూపిస్తుంది అని అందుకే తాను ప్రెజెంట్ చేసిన దేవా రోల్ లో కూడా ప్రభాస్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు.లేదంటే తల కూడా నరుకుతాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
దీన్ని బట్టే ప్రభాస్ దేవా రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అర్ధం అవుతుంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.







