టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేనాని బయలుదేరారు.ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్ కల్యాణ్ బయలుదేరారు.అక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లికి వెళ్లనున్నారు.
అక్కడ జరిగే లోకేశ్ యువగళం -నవశకం భారీ బహిరంగ సభకు పవన్ హాజరుకానున్నారు.అయితే పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ లోకేశ్ నిర్వహిస్తున్న సభకు హాజరవుతున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.







