కార్పొరేట్ బుకింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ నీల్.. సలార్ విషయంలో సంతృప్తి లేదంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సలార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా కేజీఎఫ్ 2 కలెక్షన్లను బ్రేక్ చేసినా చేయకపోయినా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కెరీర్ లలో మెమరబుల్ హిట్ గా నిలిచింది.

 Prashanth Neel Comments About Corporate Bookings Details, Prashanth Neel , Corpo-TeluguStop.com

గత కొంతకాలంగా సరైన హిట్ లేని ప్రభాస్( Prabhas ) ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎదిగారనే చెప్పాలి.అయితే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ బుకింగ్స్( Corporate Bookings ) గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

సలార్ మూవీ( Salaar ) రెస్పాన్స్ విషయంలో ప్రభాస్ సంతోషంగా ఉన్నాడు కానీ నేను పూర్తిస్థాయిలో నూటికి నూరు శాతం సంతృప్తితో లేనని ఆయన తెలిపారు.కేజీఎఫ్ 2 సినిమా( KGF 2 ) విషయంలో సైతం నాకు నూటికి నూరు శాతం సంతృప్తి లేదని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ప్రతి మేకర్ ఫీలింగ్ ఇదే విధంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ వెల్లడించడం గమనార్హం.కార్పొరేట్ బుకింగ్స్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ నెగిటివిటీకి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు.

Telugu Corporate, Prashanth Neel, Kgf, Prabhas, Prabhas Salaar, Salaar-Movie

ప్రభాస్ పోషించిన రోల్ విషయంలో మాత్రం తాను పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.సలార్ 2 మూవీ( Salaar 2 ) మరింత భారీ స్థాయిలో ఉండనుందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.సలార్ మూవీ సెకండ్ వీకెండ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Corporate, Prashanth Neel, Kgf, Prabhas, Prabhas Salaar, Salaar-Movie

సలార్ సినిమాకు ఇప్పటివరకు 550 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి.సలార్ మూవీ హిందీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.సలార్ 2 మూవీ మరింత స్పెషల్ గా ఉండబోతుందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు.సలార్2 ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube