కార్పొరేట్ బుకింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ నీల్.. సలార్ విషయంలో సంతృప్తి లేదంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సలార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా కేజీఎఫ్ 2 కలెక్షన్లను బ్రేక్ చేసినా చేయకపోయినా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కెరీర్ లలో మెమరబుల్ హిట్ గా నిలిచింది.

గత కొంతకాలంగా సరైన హిట్ లేని ప్రభాస్( Prabhas ) ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎదిగారనే చెప్పాలి.

అయితే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ బుకింగ్స్( Corporate Bookings ) గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

సలార్ మూవీ( Salaar ) రెస్పాన్స్ విషయంలో ప్రభాస్ సంతోషంగా ఉన్నాడు కానీ నేను పూర్తిస్థాయిలో నూటికి నూరు శాతం సంతృప్తితో లేనని ఆయన తెలిపారు.

కేజీఎఫ్ 2 సినిమా( KGF 2 ) విషయంలో సైతం నాకు నూటికి నూరు శాతం సంతృప్తి లేదని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ప్రతి మేకర్ ఫీలింగ్ ఇదే విధంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ వెల్లడించడం గమనార్హం.

కార్పొరేట్ బుకింగ్స్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ నెగిటివిటీకి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు.

"""/" / ప్రభాస్ పోషించిన రోల్ విషయంలో మాత్రం తాను పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

సలార్ 2 మూవీ( Salaar 2 ) మరింత భారీ స్థాయిలో ఉండనుందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.

సలార్ మూవీ సెకండ్ వీకెండ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

"""/" / సలార్ సినిమాకు ఇప్పటివరకు 550 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి.

సలార్ మూవీ హిందీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.సలార్ 2 మూవీ మరింత స్పెషల్ గా ఉండబోతుందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు.

సలార్2 ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!