కేజీఎఫ్ 3 చేయాల్సిందే అంటున్న డైరెక్టర్..?

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 1 సినిమా విడుదల అయ్యి దేశ వ్యాప్తంగా కేజిఎఫ్ సినిమా పేరు మార్మోగిపోయింది.కేజీఎఫ్ 1 సినిమా చూసిన తర్వాత కేజిఎఫ్ 2 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Director Prasanth Neel About Kgf 3 Movie Details,  Kgf 1,kgf 2, Kgf 3, Prashanth-TeluguStop.com

అయితే ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కేజీఎఫ్ 2 సినిమా ఇటీవలే విడుదల అయి ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.కేజీఎఫ్ 2 సినిమా విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అంతేకాకుండా ఇండియాస్ బిగ్గస్ట్ మూవీస్ జాబితాలో కేజీఎఫ్ 2 కూడా నిలిచింది.

అలాగే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో మూడో స్థానంలో కేజీఎఫ్ 2 సినిమా నిలిచింది.

ఇకపోతే కేజిఎఫ్ 2 ని చూసిన తర్వాత ప్రేక్షకులు కేజీఎఫ్ మూడవ పార్ట్ ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే కేజీఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా ఉంటుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా అదే విషయా పై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.

Telugu Yash, Srinidhi Shetty, Hombale, Kgf, Kgf Sequel, Kgf Chapter, Prashanth N

కేజీఎఫ్ 3 చేయాల్సిందే అన్న పరిస్థితిలో మేము ఉన్నాము.కేజీఎఫ్ సినిమాను మరియు హీరో పాత్రను అభిమానిస్తున్న వారు కేజీఎఫ్ 3 ని చేయకుంటే ఊరుకునే పరిస్థితి లేదు.అందువల్ల కేజీఎఫ్ 3 ని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.కేజీఎఫ్ 2 కు ముందే కేజీఎఫ్ 3 కోసం కొన్ని లైన్స్ ను కూడా అనుకున్నట్లుగా ప్రశాంత్ నీల్ తెలియజేశాడు.

కాకపోతే కేజీఎఫ్ 3 సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube