ఇదేందయ్యా ఇది.. పెళ్లి కావట్లేదని వీధులనిండా అలాంటి పోస్టర్లు.. ఆశ్చర్యపోతున్న జనాలు...

సాధారణంగా పెళ్లి సంబంధాల కోసం చాలామంది తమకు తెలిసిన వారి ద్వారా వెళ్తుంటారు.కొందరు మ్యారేజ్ బ్రోకర్ ని ఆశ్రయిస్తే, మరికొందరు మ్యాట్రిమోనీ సైట్స్‌నే నమ్ముకుంటారు.

 Such Are The Posters Across The Streets That This Is Not A Wedding Marriage, Gr-TeluguStop.com

కానీ ఇవేమీ వర్కౌట్ కాక ఒక వ్యక్తి చాలా నిరాశ పడ్డాడు.తనకి తప్ప తన తోటి వారితో పాటు తన ముందు లాగులు తొడుక్కున్న వారికి కూడా పెళ్లి అవుతుంటే అతడు ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడు.

చివరికి ఎవరూ ఊహించని, ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఒక ప్రయత్నం చేశాడు.అదేంటంటే తాను నివసిస్తున్న నగరమంతటా తాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుకుతున్నట్లు తన బయోడేటా వివరాలతో పోస్టర్లు అంటించాడు.

తన ఉద్యోగం, జీతం, అలవాట్ల వంటి ముఖ్యమైన వివరాలన్నీ పోస్టర్ పై ప్రింట్ చేసి కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నంబర్ కూడా అందించాడు.ఇది చూసిన నగరవాసులంతా ఇదేంది, పెళ్లి సంబంధాల కోసం ఇలా కూడా చేస్తారా అని అవాక్కవుతున్నారు.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనేది తెలుసుకుంటే. మధురై టౌన్‌లోని విల్లాపురంలో జగన్ (27) అనే ఒక యువకుడు నివసిస్తున్నాడు.అతని తల్లిదండ్రుల అయిన సుదర్శన్, చంద్ర తమ కుమారుడికి పెళ్లి చేయాలని అన్ని ప్రయత్నాలు చేశారు.కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.

దీంతో జగన్ కూడా చాలా నిరాశ పడ్డారు.బీఎస్సీ చదివి ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్నా పెళ్లి కావడం లేదని తనలో తానే మదనపడ్డాడు.

చివరికి మధురై నగరంలోని ప్రతి వీధిలో పోస్టర్లు అంటించడం ప్రారంభించాడు.ఆ పోస్టర్లలో ” నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా.

పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఎవరైనా తెలిస్తే నాకు తెలియజేయండి.నా బయో డేటా మీకు నచ్చినట్లయితే మీ అమ్మాయిని నేను చేసుకోవడానికి రెడీ.పిల్లను ఇచ్చే ఉద్దేశం ఉన్నవారు దయచేసి నా ఫోన్ నంబర్‌కి కాల్ చేయండి.” అని పేర్కొన్నాడు.అయితే ఈ పోస్టర్లు మధురై టౌన్‌లోని మీనాక్షి టెంపుల్ దగ్గర నుంచి హైకోర్టు వరకు ప్రతి చోటా కనిపిస్తుండటంతో నగర వాసులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.కొందరు దీన్ని చూసి ఏం ఐడియా గురు అని పొగుడుతున్నారు.

ఈ పోస్టర్లను కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు.దాంతో దీని గురించి అందరికీ తెలిసింది.

ఈ ప్రయత్నం గురించి తెలుసుకున్న చాలామంది ‘ఎంత కష్టం వచ్చింది భయ్యా! నీకు త్వరగా పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube