కేంద్రంలో కాంగ్రెస్ న అధికారంలోకి తీసుకురావడం బిజెపిని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా భారత్ జాడో యాత్ర పేరుతో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర మొదలుపెట్టారు.ఈ యాత్రకు జనాల నుంచి స్పందన కనిపిస్తోంది.
ఇప్పటికే తమిళనాడులో యాత్రను రాహుల్ ముగించుకున్నారు.అక్కడ అధికార పార్టీ డిఎంకె అన్ని విధాలుగా రాహుల్ యాత్రకు సహకారం అందించింది.
స్వయంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక బిజెపి రాహుల్ పాదయాత్ర పైన , ఆయన వేసుకున్న టీ షర్టు పైన పెద్ద రాద్ధాంతమే చేస్తూ, ఆయన్ని ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేసింది.
ఇదిలా ఉంటే రాహుల్ పాదయాత్ర పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.దాడి ఒకవైపు జరిగితే, మరోవైపు సైన్యాన్ని పంపినట్లు రాహుల్ పాదయాత్ర కొనసాగుతోందని ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు.
బిజెపి బలంగా ఉన్న ప్రాంతాల్లో రాహుల్ యాత్ర చేపడితే బాగుండేదని, కానీ బిజెపి ప్రభావం లేని ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేపట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు. బిజెపి బలంగా ఉన్నచోట యాత్ర చేయకుండా, ఆ పార్టీ ప్రభావం లేని చోట్ల పాదయాత్ర చేయడం ఇదేం లాజిక్ అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.
తూర్పున దాడి జరిగితే పశ్చిమానికి సైన్యాన్ని పంపినట్లు బిజెపి బలహీనంగా ఉన్నచోట రాహుల్ పాదయాత్ర చేయడం ఏమిటి ? బిజెపి బలంగా ఉన్నచోటికి కదా రాహుల్ వెళ్ళాలి… అక్కడ యాత్ర చేయాలి.

7 కానీ ఇదేం లాజిక్ బిజెపి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రాహుల్ తిరగడం వల్ల బీజేపీ ఏ విధంగా బలహీనపడుతుందని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బిజెపెయేతర ప్రాంతాలే ఉన్నాయని, మధ్యప్రదేశ్ , కర్ణాటక , హర్యానా, మహారాష్ట్ర ఇలా రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలోనూ బిజెపి అధికారంలో లేదని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన షెడ్యూల్ చాలా తక్కువగా ఉందని, గుజరాత్ , యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అసలు పాదయాత్ర షెడ్యూల్ లేదని , దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదంటూ ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.