ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( DSP Praneet Rao ) రెండో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.
నిన్న ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు.అదేవిధంగా నిన్న ఎస్ఐబీ ( SIB )కార్యాలయానికి ప్రణీత్ రావును పోలీసులు తీసుకెళ్లారు.
అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, రికార్డుల మాయంపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే 47 హార్డ్ డిస్కులను కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లను కూడా టాపింగ్ చేసినట్లు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు చెప్పిన వాటిపై ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.