దేశంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వ్యవసాయం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రైతులకు పెట్టుబడులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం పెరగడం లేదు.అయితే తెలివిగా వ్యవసాయం చేస్తే మాత్రం వ్యవసాయంలో కూడా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చు.
దేశంలోని ధనిక రైతులలో ప్రమోద్ గౌతమ్( Pramod goutham ) ఒకరు కాగా ఇతని సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
బీటెక్ చదివిన ప్రమోద్ గౌతమ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు.వ్యవసాయంపై ఆసక్తితో ఇంజనీర్ జాబ్ వదిలిన గౌతమ్ ప్రమోద్ ప్రస్తుతం వ్యవసాయం( Agriculture ) ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు.ఉద్యోగంలో సంతృప్తి లేక 26 ఎకరాల భూమిలో వ్యవసాయం మొదలుపెట్టిన ప్రమోద్ గౌతమ్ ఉద్యాన పంటలను సాగు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.
గ్రీన్ హౌస్ లో పండ్లు, కూరగాయలను పండిస్తున్న ప్రమోద్ గౌతమ్ పప్పుకు సంబంధించిన పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేస్తూ ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.వందన ఫుడ్స్( Vandana Foods ) అనే బ్రాండ్ తో ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ల ద్వారా తన పంట ఉత్పత్తులను ప్రమోద్ గౌతమ్ విక్రయిస్తూ ఉండటం గమనార్హం.ప్రమోద్ గౌతమ్ నెల ఆదాయం 10 నుంచి 12 లక్షల రూపాయలుగా ఉండగా ఏడాది ఆదాయం కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండనుందని తెలుస్తోంది.
దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ప్రమోద్ గౌతమ్ ఒకరిగా ఉన్నారు.ప్రమోద్ గౌతమ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని తెలుస్తోంది.ప్రమోద్ గౌతమ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ప్రమోద్ గౌతమ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
సరిగ్గా పెట్టుబడులు పెడితే వ్యవసాయం కూడా మంచి లాభాలను అందిస్తుందని ప్రమోద్ గౌతమ్ ప్రూవ్ చేశారు.