బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.అగ ఇటీవల ఈ సినిమా నుంచి భేషరమ్ అనే సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
దీంతో పాటుగా ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.తాజాగా విడుదలైన భేషరమ్ సాంగ్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా దీపికా పదుకొనే బికినీలో అందాలను ఆరబోసింది.
అయితే ఆ పాటలో దీపికా పదుకొనే షారుక్ ఖాన్ రొమాన్స్ అలాగే కాస్ట్యూమ్స్ ప్రస్తుతం వివాదంగా మారుతున్నాయి.ఈ సాంగ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.ఇంకొందరు మాత్రం ఆ సాంగ్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదంగా మారాయి.
ఆ పాట పై స్పందించిన నరోత్తమ్ ఆ పాటని డర్టీ మైండ్ తో చిత్రీకరించినట్లు ఉన్నారు.అందులో దీపికా పదుకొనే ధరించిన కాస్ట్యూమ్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయి అని వాఖ్యానించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ భేషరమ్ బిగోట్స్ కాషాయం ధరించిన స్వామీజీలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు ఎటువంటి వివాదం లేదు.అటువంటి ఎమ్మెల్యేలు నాయకులు పబ్లిక్ గా తిరగవచ్చు.అయినా ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ ఇప్పుడు దీపికా పదుకొనే సినిమాలో కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందా జస్ట్ ఆస్కింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్.దీంతో ఈ సినిమాలోని పాటలు సన్నివేశాల వివాదం ఎంత దూరం వరకు వెళ్తాయో అంటూ నెటిజిన్స్ చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.అలాగే అదే స్థాయిలో సినిమాకు మద్దతు కూడా తెలుపుతున్నారు.