ప్రకాష్‌ రాజ్‌ను బ్యాన్‌ చేస్తారట... దానిపై ఆయన ఏమన్నాడంటే

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌.ఈయన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు.

 Prakash Raj Banned In Kollywood-TeluguStop.com

క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ప్రకాష్‌ రాజ్‌ పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్నికల సభలో ఆమ్‌ ఆద్మీ తరపున ప్రకాష్‌ రాజ్‌ పాల్గొన్న విషయం తెల్సిందే.

ఆ సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్‌ రాజ్‌ సమర్ధించాడు.దాంతో ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఆ వ్యాఖ్యల కారణంగా తమిళ సినీ ఇండస్ట్రీ నుండి బ్యాన్‌ అయ్యే పరిస్థితికి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొన్నాళ్ల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఢిల్లీలో ఎక్కువగా తమిళనాడుకు చెందిన స్టూడెంట్స్‌ చదువుతున్నారు.అందువల్ల స్థానికులు అయిన ఢిల్లీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.

ఢిల్లీ పిల్లలకు అవకాశాలు తగ్గుతున్నాయని అన్నాడు.కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై తమిళజనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంది.కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని తమిళనాడు సీఎం కూడా అన్నాడు.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడటం జరిగింది.ఢిల్లీ విద్యార్థుల ఆందోళన అర్ధం చేసుకోవాల్సిన విషయం అన్నాడు.

ప్రకాష్‌ రాజ్‌ను బ్యాన్‌ చేస�

ఇక తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అంటూ చాలా మంది అనుకుంటారు.నేను తమిళుడిని కాదు, నేను కర్ణాటకకు చెందిన వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చాడు.తమిళనాడుపై ఇంత విషం కక్కిన వ్యక్తి మళ్లీ తమిళ సినిమాల్లో ఎలా నటిస్తాడంటూ ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పటికే తమిళనాడు బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రకాష్‌ రాజ్‌కు వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నారు.

ఇదే సమయంలో ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ తన మాటలను వక్రీకరించారు అంటూ చెప్పుకొచ్చాడు.రాజకీయ దురుద్దేశ్యంతో నన్ను బ్యాన్‌ చేయించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ప్రకాష్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube