మన దేశం, ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది - కె.ఎ. పాల్

విజయవాడ: మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న కె.ఎ.పాల్. దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించే మీడియా ఓనర్స్, ప్రతినిధులు కు దేవుని ఆశీస్సులు ఉండాలి.

 Prajasanthi Party Ka Paul Shocking Comments In Meet The Press Program Details, P-TeluguStop.com

ఫాలకులే మీడియా ను భయపెడుతున్నారు.అదానీ లాంటి వాళ్లు మీడియా ను కొనేస్తున్నారు.

వినకపోతే చంపే‌వరకూ వెళుతున్నారు.అంతు చూస్తామని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు.

ప్రజా స్వామ్యం చనిపోతుందని ముందే చెప్పా.ఇప్పుడు అదే జరిగింది.

న్యాయ వ్యవస్థ పై కూడా నలుగురు న్యాయమూర్తులు బయటకి వచ్చి మాట్లాడారు.కొంతమంది న్యాయ మూర్తులను బెదిరించే స్థాయికి వచ్చారు.

ఈవిఎం లు అయితే బిజెపి కి‌ 300 సీట్లు తప్పవని చెప్పా.బ్యాలెట్ విధానం లో ఎన్నికలు పెట్టాలని కోరా.

ఈవిఎం లతో మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చింది.ప్రజా శాంతి‌పార్టీ లో చేరేందుకు ఐఎయస్, ఐపియస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు.

నేషనల్ మీడియా ఒత్తిళ్లకు లొంగి అమ్ముడుపోయింది.తెలుగు మీడియా భయపడకుండా వార్తలు ఇస్తున్నారు.

అటువంటి టివి, పేపర్ యజమానులకు అభినందనలు.మోడీ ప్రతిపక్ష నేతల పై సిబిఐ, ఈడి లతో దాడులు చేయిస్తున్నారు.

మన దేశం, ఆర్ధిక వ్యవస్థ ప్రమాదం లో ఉంది.ఈవిఎం పద్ధతి న ఓటింగ్ వద్దు… బ్యాలెట్ విధానమే ముద్దు.న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు స్పందించాలి.లైవ్ లు ఇచ్చే ఛానల్స్ ను దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు.

ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.బూత్ కమిటీ లు అయ్యే వరకు జిల్లాల్లో తిరుగుతా.

ఎపికి ఎనిమిది లక్షల కోట్లు అప్పు.రూపాయి పుట్టే పరిస్థితి లేదు.

తెలంగాణ లో ఐదు కోట్ల అప్పు.ఏం చేశారో తెలియదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలి.ఈ దేశం మరో శ్రీలంక లాగా మారుతుంది.

మోడీ 76లక్షల కోట్లు అప్పు చేశారు.వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలి.

మోడీకి కూడా నేను లేఖలు రాశాను.ఆరు నెలల్లోనే మన దేశం నాశనం‌ కాబోతుంది.

రోగికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన విధంగా.ఈ దేశానికి మంచి మందు కావాలి.

దేశ ఆర్ధిక పరిస్థితి గమనించి, సరి దిద్దాలి.మన దేశం, రాష్ట్రాలు ఆర్ధికంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.

దేశ, రాష్ట్ర నాయకులు ప్రభుత్వ సంపదను వారి నాయకులకు దోచి పెడుతున్నారు.

అదానీ కి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారు.

రాష్ట్ర విభజన బిల్లులో అంశాలను అమలు చేయలేదు.ఈ రాష్ట్రం నాశనం‌ కావడానికి నలుగురు ప్రధాన కారణం.

మాజీ సిఎం చంద్రబాబు నేను చెప్పిన సలహాలను పట్టించుకోలేదు.ఆయన ప్రధానమంత్రి కావడానికి, కొడుకు ను సిఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారు.

ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు.మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు.

చంద్రబాబు కు వయసు మళ్లింది… ఇప్పుడు అయినా నాకు మద్దతు ఇవ్వండి.నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా.

చంద్రబాబు, జగన్, నేను ముగ్గురం ఒకే వేదిక పై చర్చ కు సిద్దం.చంద్రబాబు కలలో కూడా గెలవరు… ఎపిలో టిడిపి భూస్థాపితం కావడం ఖాయం.

గతంలో తెలంగాణ అవుతుందని చెప్పా.నిజం అయ్యింది.

టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచించి నాకు మద్దతు ఇవ్వండి.చంద్రబాబు తెలుగు ప్రజల గురించి మంచి నిర్ణయం చేయండి.

రెండో దోషిగా నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేశారు.ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు.

అనేక మంది జాతీయ నాయకులు నన్ను కలుస్తున్నారు.

కేసులతో వేధిస్తారని మోడీకి అందరూ భయపడుతున్నారు.

దేశంలో మార్పు రావాలంటే… అందరూ నాకు మద్దతు ఇవ్వండి.మూడో దోషి జగన్మోహన్ రెడ్డి.

ఆయన తండ్రి, తల్లి నాకు ఎంతో గౌరవం ఇచ్చారు.జగన్ మాత్రం నన్ను కలవటానికి ఆసక్తి చూపడం లేదు.

సీక్రెట్ గా అయినా ఆహ్వానిస్తే నేనే వెళ్లి కలుస్తా.రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలి.

అప్పులు, ఇబ్బందులు, ఉన్న రాష్ట్రాన్ని మీకు ఇచ్చారు పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి‌ వచ్చారు .నేడు నవ రత్నాలు ఇవ్వడానికి మీ వద్ద డబ్బులు లేవు.ఇంకా ఆరు నెలలు ఈ‌పధకాలకు డబ్బు ఎలా తెస్తారు.నాతో కలవండి… పరిష్కారం చూపిస్తా.లేదా మా పార్టీ లో మీరు చేరిపోండి… నేను అన్నీ‌ చూసుకుంటా.అనేక‌ జిల్లాల్లో నా సమావేశాలు జరుగుతున్నాయి.

నాకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్‌ చేస్తే.ఫలితం అనుభవిస్తారు.

జగన్ ను చంద్రబాబు ఏడిపించాడు.ఇప్పుడు అసెంబ్లీ లో ఏడుస్తున్నాడు.

మాకు ఫంక్షన్ హాల్స్ ను ఇవ్వకుండా అడ్డుకోవద్దు.నాకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు శత్రువులు కాదు.

కానీ పవన్ కళ్యాణ్ పొత్తుల పార్టీ లు మారుస్తూ వస్తున్నాడు.ఈ అన్నయ్య తో కలువు… నీకు అంతా మంచి జరుగుతుంది.

దశావతారాలు వద్దు… నేనంటే పవన్ కు గౌరవం.తమ్ముడు ముందుకు వస్తే.

కలిసి పని చేస్తాం.కమ్యూనిస్టు లు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube