తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా పాలన( Praja Palana ) దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉన్నారు.
జనవరి ఆరవ తారీకు వరకు “ప్రజా పాలన” దరఖాస్తులను స్వీకరించనన్నారు.ఈ క్రమంలో “ప్రజా పాలన” దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 6తారీకే చివరి రోజు అని పేర్కొనడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి* Shankthi Kumari ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఇకపై నాలుగు నెలలకోసారి “ప్రజా పాలన” కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఇప్పుడు దరఖాస్తు చేయలేని వారు చేసుకోవచ్చని వెల్లడించారు.“ప్రజా పాలన” సదస్సులు ముగియగానే ఈనెల 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.ఆధార్, తెల్ల రేషన్ కార్డు ( Aadhaar, white ration card )ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని సూచించడం జరిగింది.ఈ మేరకు సిబ్బందికి రేపు ఎల్లుండా శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పష్టం చేశారు.దీంతో ఇంక మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా “ప్రజా పాలన” దరఖాస్తుల కార్యక్రమం ముమ్మ రంగా జరుగుతుంది.“ప్రజా పాలన” దరఖాస్తుల స్వీకరణలో ముందుగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.