సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య హిట్టు ఫ్లాపు అనే సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం.అయితే వాల్తేరు వీరయ్య విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ తీసుకున్నప్పటికీ వారి పాత్రలను పరిమితం చేశారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.మరి ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రతి రావత్ లాంటి నటుడుని జూనియర్ ఆర్టిస్ట్ కన్నా తక్కువగా చూసారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రదీప్ రావత్ సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పేరున్న నటుడు.సై సినిమాలో బిక్షపతి పాత్రతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ప్రదీప్ ఆ తర్వాత అనేక సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు.ఇటీవల కాస్త తక్కువ సినిమాల్లోనే కనిపిస్తున్న ప్రతి మెగాస్టార్ సినిమాలో ఇలా తక్కువ ప్రాధాన్యత ఉన్న రోల్లో నటించడం ఆయన అభిమానుల్ని కలవరానికి గురిచేస్తుంది.ఆ మధ్యకాలంలో ప్రదీప్ రావత్ తెలుగు చిత్ర సీమకు కొన్ని విభేదాల కారణంగా దూరమయ్యాడు.
ఆ తర్వాత అడపా దడపా చిన్న చిన్న పాత్రలోనే కనిపిస్తూ వస్తున్నాడు.

అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ప్రదీప్ రావత్ కనిపించడం మంచి విషయమే అయినా ఒక్క డైలాగ్ కూడా లేని పాత్ర చేయడం ఆయన స్థాయి కి తగ్గట్టు కాదు అని బాబి అంత పెద్ద స్టార్ నటుడిని అలాంటి పాత్ర కోసం ఎంచుకోవడం అది ప్రదీప్ ని అవమానించడంతో సమానం అంటూ పలువురు భావిస్తున్నారు.అయితే మెగా అభిమానులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు ప్రదీప్ రావత్ కి మరికొన్ని ముఖ్యమైన సీన్స్ ఇచ్చే ఉంటారని కానీ ఎడిటింగ్ లో అవి పోయి ఉంటాయని కామెంట్స్ చేయడం విశేషం.అలా చేస్తే ఓకే కానీ ప్రదీప్ ని పని కట్టుకొని అవమానించే అవసరం ఏముంటుంది చెప్పండి.







