చాలా రోజులుగా తెలుగు సినిమా హీరోలు ఎంత వయసొచ్చినా కూడా హీరో గానే ఉండడానికి ఇష్టపడుతున్న విధానం గురించి మనం పలు ఆర్టికల్స్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాం.ఇక వారి వయసుకు తగిన పాత్రలు ఎంచుకోక కుర్రబామలతో స్టెప్పులు వేస్తున్న విధానం కూడా ఒక వర్గానికి నచ్చడం లేదు అని కూడా చెప్పుకుంటున్నాం.
ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా మాకు సినిమాలు చేయడం మాత్రమే ముఖ్యం, మా అభిమానులు మమ్మల్ని చూస్తారు అని అనుకుంటూ స్టార్ హీరోలు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు.
ఇక ఈ సంక్రాంతి హీరోలకు మరీ దారుణంగా మనవరాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నప్పటికీ హీరోలుగా ఉండాలనే యావ చావడం లేదు.
వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే చిరంజీవి ఎంత కామెడీ చేసి మాయ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆయన ముఖంలో ముడతలు ముసలి తనం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రిందట సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఇప్పటికీ అదే హీరోయిజం, అదే కమర్షియల్ ఫార్ములా, అదే రొటీన్ రొట్ట స్టోరీలు.
ఆయన మారలేదు అలాగే ఆయన ఎంచుకునే పద్ధతి మారడం లేదు.ఇక మరోవైపు వాల్తేరు వీరయ్య లో నటించిన మరో హీరో రవితేజ సైతం తన శరీరాకృతిని కాపాడుకుంటూ వస్తున్న వయసు పెరిగినట్టు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది.

బాలకృష్ణ సైతం వీరసింహారెడ్డి సినిమాలో పంచు డైలాగులతో అభిమానులను పెంచుకుంటూ పోతున్నప్పటికీ ఆయన వయసు పెరిగి ముడతలు పడి తెర పై చాలా ఏళ్లుగా కనిపిస్తుంది.అయినా కూడా హీరోలుగా ఉండాలని ఆ కుతూహలం వీరికి తగ్గడం లేదు.పైగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ తమకు తగ్గుతున్న ఆ క్రేజ్ ని మరో హీరోలతో భర్తీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.ఇక ఇప్పటికైనా ఈ 60 ఏళ్ళు దాటిన హీరోలు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద తరహా పాత్రలు చేసుకోవడము మంచిది.







