బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఈ సినిమా హిట్ తర్వాత ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు.
ఇంత స్టార్ డమ్ వచ్చి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండరు అనేది అందరికి తెలిసిన విషయమే.ఆయనకు సంబందించిన విషయం వేరే వారి ద్వారా తెలియడమే కానీ ఈయన మాత్రం తక్కువ విషయాలను అభిమానులతో పంచుకుంటాడు.
ప్రభాస్ ముందు పేస్ బుక్ మాత్రమే కలిగి ఉన్న ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో జాయిన్ అయ్యాడు.అయితే ఈయనకు ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఈయన ట్విట్టర్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడు ట్విట్టర్ లో ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూసే అభిమానులకు ఇప్పుడు ఈయన గుడ్ న్యూస్ చెబుతున్నాడు.త్వరలోనే ప్రభాస్ ట్విట్టర్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ప్రభాస్ సన్నిహితులు ఇంకా ఫ్యాన్స్ ఒత్తిడికి తలొగ్గి ట్విట్టర్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పాడని త్వరలోనే ఈయన ఇందులో జాయిన్ అయ్యి సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.ఈ సమయంలో అయినా ఈయన జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సన్నిహితుల ద్వారా బలంగా టాక్ వినిపిస్తుంది.
ఇదే కనుక నిజం అయితే ఫాలోవర్స్ తోనే ట్విట్టర్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.