రాశిపై మనస్సు పడ్డ రెబల్‌స్టార్‌

గోపీచంద్‌ హీరోగా వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘జిల్‌’.ఈ సినిమా ఆడియో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ప్రభాస్‌ చేతుల మీదుగా ఆ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ప్రభాస్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాశిఖన్నాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

చాలా గ్లామరస్‌గా, అందంగా రాశి ఖన్నా కనిపిస్తుందంటూ ప్రభాస్‌ కామెంట్స్‌ చేశాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాశి ఖన్నాతో త్వరలో ప్రభాస్‌ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల కాగానే ప్రభాస్‌ ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే ప్లాన్‌ చేస్తున్నాడు.ప్రభాస్‌ మిత్రులు అయిన వంశీ, ప్రమోద్‌లు ఆ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Advertisement

‘రన్‌ రాజా రన్‌’ దర్శకుడు సుజీత్‌ లేదా దశరథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఇక ఆ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఎంపిక చేయాల్సిందిగా నిర్మాతలకు ప్రభాస్‌ సూచించినట్లుగా తెలుస్తోంది.

మేలో చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.మొత్తానికి అమ్మడు ప్రభాస్‌తో ఆఫర్‌ను దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజతో ‘బెంగాళ్‌ టైగర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఏం రివిల్ చేయబోతున్నారు అంటే..?
Advertisement

తాజా వార్తలు