టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఒకింత సంచలనాలు సృష్టించదం గమనార్హం.
సలార్,( Salaar ) కల్కి( Kalki ) సినిమాలతో ప్రభాస్ ఖాతాలో మరో రెండు హిట్లు చేరాయి.
ఈ ఏడు సినిమాల కలెక్షన్లు ఏకంగా 5300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ప్రభాస్ సినిమాలు( Prabhas Movies ) సులువుగానే 500 కోట్ల రూపాయల మార్కును అందుకుంటున్నాయి.
ప్రభాస్ సాధిస్తున్న రికార్డులు ఇతర హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.ప్రభాస్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు.

ప్రభాస్ రెమ్యునరేషన్( Prabhas Remuneration ) 100 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు కన్నప్ప, ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉండగా ఈ సినిమాలు ఎప్పటికి సెట్స్ పైకి వెళ్తాయో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ఎన్ని విజయాలు సాధిస్తున్నా సింపుల్ గా ఉంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇతర భాషల్లో సైతం ప్రభాస్ క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతోంది.
ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.ప్రభాస్ 2025 సంవత్సరంలో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.







