'సలార్‌' ఇతర పాటల గురించిన అప్డేట్

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా విడుదలకు రంగం సిద్ధం అయింది.క్రిస్మస్ కానుకగా సరిగ్గా వారం రోజుల్లో సినిమా ను విడుదల చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

 Prabhas Salaar Movie Songs Update-TeluguStop.com

కానీ ఇప్పటి వరకు సినిమా నుంచి ఒకే ఒక్క పాట వచ్చింది.అది కూడా రెండు రోజుల క్రితం విడుదల అయింది.

ఇతర పాటల పరిస్థితి ఏంటి అంటే మాత్రం యూనిట్‌ సభ్యుల నుంచి క్లారిటీ లేదు.వారు చెబుతున్న అనధికారిక సమాచారం ప్రకారం సలార్‌ లో ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి.

వాటిని సినిమా విడుదలకు ముందు విడుదల చేయాలని భావించడం లేదు.సినిమా ని చూసే సమయంలోనే ఆ పాటలను చూస్తారు అంటూ ప్రశాంత్‌ నీల్ టీమ్‌ వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

అందుకు సంబంధించిన ముందస్తు రిలీజ్ కి ఎలాంటి ప్లాన్ లేదు.

సినిమా లో ఆ పాటలను చూస్తేనే బాగుంటుంది.సందర్భానుసారంగా ఉండే పాటలు కనుక వాటిని ముందస్తుగా విడుదల చేయడం ద్వారా ఫీల్ పోయే ప్రమాదం ఉంది.అందుకే సినిమా లో ఆ పాటలను చూసే విధంగా ప్లాన్ చేశారట.

ఈ సినిమా లో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటించింది.మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.

ఇంకా ఈ సినిమా లో జగపతి బాబు మరియు శ్రియా రెడ్డి కూడా నటించారు.వారి పాత్ర ల విషయం లో కూడా చాలా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొత్తానికి సినిమా కచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందా లేదా మాస్ మరియు యాక్షన్ సినిమా లను ఇష్టపడే వారు మాత్రమే ఈ సినిమా ను ఇష్టపడుతారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube