యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ హోప్స్ నెలకొన్నాయి.
క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
ట్రైలర్ తర్వాత ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా మారారు.
ఈ ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేయగా ముందు కంటే ఈగర్ గా ఈ మూవీ కోసం అంత ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్( Advance Bookings ) ఇప్పటికే స్టార్ట్ అయ్యిన విషయం తెలిసిందే.యుఎస్ లో ప్రీమియర్ లలో( US Premiere ) సలార్ హవా ఇప్పటికే స్టార్ట్ అయ్యినట్టు కనిపిస్తుంది.ఇంకా ఇన్ని రోజులు ఉండగానే యుఎస్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే సిద్ధం అవుతున్నారు.దీంతో ఈ మూవీ జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే ఇప్పటికే హాఫ్ మిలియన్ దిశగా దూసుకు పోతున్నట్టు తెలుస్తుంది.

చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది.దీంతో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయం అనే చెప్పాలి.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో.







